ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరియంట్ ఒమిక్రాన్ పై భారత్ లో కూడా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఒమిక్రాన్ ఎంటరైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
బ్రెజిల్ నుంచి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని.. టెస్టులు చేయించగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీలో అసలు ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసింది. సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ మాత్రమే వచ్చిందని.. ఒమిక్రాన్ కు చెందిన టెస్ట్ రిపోర్ట్ ఇంకా రాలేదని.. కావున ఒమిక్రాన్ సోకినట్లు వస్తున్న వార్తలను నమ్మొదన్న ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారి బి.జగన్నాథరావు ప్రకటన విడుదల చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఒమిక్రాన్ సోకినట్లు ప్రచారంలో ఉన్న వ్యక్తి నవంబర్ 20వ తేదీన బ్రెజిల్ నుంచి బయలుదేరే సమయంలో కరోనా టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని..ఆయన సౌతాఫ్రికా మీదుగా నవంబర్ 22వ తేదీన ముంబై చేరుకోగానే టెస్ట్ చేయించుకోగా అక్కడ కూడా నెగెటివ్ వచ్చినట్లు శ్రీకాకుళం డీఎంహెచ్ఓ లిపారు. ఆయన ఈనెల 23వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఉమిలాడ చేరుకున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరాల మేరకు ఈనెల 5వ తేదిన కరోనా టెస్టులు నిర్వహించగా పొజిటివ్ గా తేలినట్లు అధికారులు వివరించారు. వెంటనే సదరు వ్యక్తి సీరం శాంపిల్స్ ను టెస్టులకు పంపామని.. ఇంకా టెస్ట్ రిజల్ట్స్ రాలేదని.. అప్పటివరకు ఇది సాధారణ కరోనా మాత్రమేనని స్పష్టం చేశారు. మరో మూడు రోజుల్లో టెస్టు రిపోర్ట్స్ వస్తాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా నిబంధనలు మరింత కఠినం చేసింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం, WHO నిర్దేశించిన కరోనా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి రూ.100 జరిమానా విధించాలని ఆదేశాలిచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)