సాధరణంగా సమ్మర్ సేల్.. ఆషాడం సేల్, దసరా సేల్, దిపావళి సేల్, సంక్రాంతి సేల్ ఇలా చాలా రకాల ఆఫర్ల వర్ష కురిపిస్తుంటారు వ్యాపారస్తులు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది సీజన్ తో సంబంధం లేకుండా ఆఫర్ల వర్షం కురిపించేలా చేస్తోంది కరోనా.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీగా ఆఫర్లు రెడీగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి.. ఈ డిస్కౌంట్ పొందడి అంటూ కొత్త కొత్త ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.
ఫ్లైట్ నుంచి ఫుడ్ వరకు ఆఫర్లు కనిపిస్తూనే ఉన్నాయి. భారతదేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. వైరస్ కు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. సాధ్యమైనంత తొందరలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే..చాలా మంది వ్యాక్సిన్ ఇప్పించుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో కొన్ని సామాజిక సంస్థలు, ఇతర కంపెనీలు పలు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.
ఇతర దేశాల్లో సంగతి ఎలా ఉన్నా.. మన దేశంలో చాలాచోట్ల వ్యాక్సిన్ వేసుకుంటే..బీరు, బిర్యానీ ఫ్రీగా ఇస్తున్న సంస్థలు చాలానే ఉన్నాయి. తాజాగా.. విమానయాన రంగంలో ఉన్న ఇండిగో కూడా ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు వ్యాక్సిన్ ఫేర్ పేరిట కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. 2021, జూన్ 23వ తేదీ బుధవారం అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
18 ఏళ్లకు పైబడి ఉన్న వారు వ్యాక్సిన్ వేసుకుంటే..టికెట్ బుక్ చేసుకున్న సమయానికి భారత్ లో రెండు డోస్ లు లేదా కనీసం ఒక్క డోస్ తీసుకున్న వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది. వ్యాక్సిన్ వేసుకున్నట్టు రుజువులు చూపిస్తే బేస్ ధరపై పది శాతం రాయితీ ఇస్తామేని ప్రకటించింది. ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలని అనుకున్న వారు..కేంద్ర ఆరోగ్య శాఖ..జారీ చేసిన టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకరావాల్సి ఉంటుందని, దీనిని ఎయిర్ పోర్టు చెక్ చేసే కౌంటర్, బోర్డింగ్ వద్ద చూపించాలని తెలిపింది.
ఒక్క ఇండిగోనే కాదు చాలా సంస్థలు ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా సెంట్రల్ బ్యాంక్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న తమ ఖాతాదారులకు డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు గోద్రేజ్ కంపెనీ కూడా ఆఫర్ అంటూ ముందుకు వచ్చింది. ఎవరైతే గోద్రేజ్ కంపెనీ వినియోగదారులు ఉంటారు వారు వ్యాక్సిన్ వేయించుకుని ఉన్నట్టేతే వారికి వారంటీ పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించింది.
ప్రజల్లో చైత్యనం పెంచుతూ... వ్యాక్సిన్ వేయించుకునేలా చేయించేందుకు గుజరాత్... సూరత్‌లో అక్కడి బంగారు వ్యాపారుల సంఘం... అదిరిపోయే ఆఫర్ తెచ్చింది. వ్యాక్సిన్ వేయించుకునే మహిళలకు ఉచితంగా ముక్కుపుడక ఇస్తామని ప్రకటించింది. అదే పురుషులు వ్యాక్సిన్ వేయించుకుంటే... హ్యాండ్ బ్లెండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. కనీసం ఇలాగైనా వ్యాక్సిన్ వేయించుకుంటారనే ఉద్దేశం ఆ సంఘానిది.