Free Food: కరోనా వేళ ఉచిత భోజనం, నిత్యావసర సరుకులు.. హోం డెలివరీ.. ఈ నెంబర్లకు కాల్ చేయండి

Free Food: కరోనా సెకండ్ వేవ్‌లో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పేషెంట్లు హోం ఐసోలేషన్‌లో సరైన భోజన సదుపాయం లేక బాధపడుతున్నారు. ఇక లాక్‌డౌన్‌తో పేదలు, రోజువారీ కూలీలు ఆకలిలో అలమటిస్తున్నారు. ఇలాంటి వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా భోజనం, ఆహారం అందిస్తున్నాయి. నేరుగా ఇంటికే డెలివరీ చేస్తున్నాయి. ఈ వివరాలను ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తన ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేశారు.