ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ పై సర్వత్రా ఆందోళన నెలకొంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
ఇప్పటికే దేశవ్యాప్తంగా 40కి పైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాగా.., ఆంధ్రప్రదేశ్ లోనూ తొలి కేసు నమోదైంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ పై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని స్పష్టత ఇచ్చారు. (ఫైల్ ఫోటో)
4/ 6
కొన్నిరోజుల క్రితం తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైనట్లు ఆళ్లనాని తెలిపారు. ఐతే డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి ట్రీట్మెంట్ పూర్తైందని.. అతడి నుంచి ఇతరులకు వ్యాపించలేదని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని సీఎం జగన్ తో జరిగిన సమీక్షా సమావేశంలో ఆళ్లనాని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం - image credit - NIAID)