లేదు...పోయింది..ఇక రాదు అనుకొని హ్యాపీగా జనం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇండియాలో కలకలం రేపుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసులు భారత్‌లోనే కాదు తెలంగాణలో కూడా గుబులు పుట్టిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 9
కరోనా వైరస్ జన్యు రూపం మార్చుకొని మానవాళిపై దండయాత్ర చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాలు భయంతో గజగజ వణికిపోతున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎక్స్్బీబీ1.5 వేరియంట్ కేసులు కూడా చాప కింద నీరులా భారత్‌లో పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 9
ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ కేసులు గుజరాత్లో మూడు కేసులు నమోదయ్యాయి. కర్నాటక, రాజస్థాన్‌లో ఒక్కో కేసు నమోదైంది. తాజాగా తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లోనూ ఒక్కో కేసు నమోదు కావడం దడ పుట్టిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 9
కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా ఏడుకు చేరిందని ఇన్పాకాగ్ వెల్లడించింది. ఈ వేరియంట్ కేసులు చైనా, అమెరికాలో విస్తృతంగా పెరుగుతున్నట్లుగా అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 9
ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్ని గడగడలాడించిన కరోనా వైరస్ కొత్త సంవత్సరంలో కూడా కొత్త వేరియంట్ రూపంలో దాడి చేయడందతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కరోనా మార్గదర్శకాల్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 9
బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వాడకం, అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఎయిర్‌పోర్ట్‌లతో కరోనా టెస్ట్‌లు తప్పని సరి చేసింది. దీనికి వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌తో పాటు కోవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే దేశంలోకి అనుమతించేలా చర్యలు చేపడుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 9
కరోనా మహమ్మారి గతంలో నేర్పిన గుణపాఠాల ఆదారంగా బూస్టర్ డోస్‌ని ముక్కు చుక్కల ద్వారా తీసుకోవాచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటికే ఈ చుక్కల మందు అందుబాటులోకి వచ్చింది. 18ఏళ్లు నిండిన వారికి ఈ నాసిల్ డ్రాప్స్ వేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
8/ 9
ముక్కులోని రెండు రంద్రాల్లో ఒక్కో దాంట్లో నాలుగు చుక్కల చొప్పున వేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ నాసిల్ డ్రాప్స్ ధర 325రూపాయలుగా నిర్ణయించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 800రూపాయలకు అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మకచిత్రం)
9/ 9
కరోనా పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే వైద్య సేవలు, వ్యాక్సిన్ కంటే వ్యక్తిగత నియంత్రణ, శుభ్రత చాలా ముఖ్యమంత్రి డాక్టర్లు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ విజృంభించకుండా చూసుకోవాల్సిన అందరిపైన ఉందంటున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)