కరోనా సమయంలో పేదలకు ఆదుకుంటున్న ఎంపీ నవనీత్ కౌర్..

Corona Effect | కరోనా వైరస్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో చైనాతో పాటు భారత్ సహా అన్ని దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు పని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ తన నియోజకవర్గంలో పేదలకు తన వంతు సాయం చేస్తోంది. అంతేకాదు కరోనాను తప్పించుకోవడానికి ప్రజలకు తగిని సూచనలు, సలహాలు అందిస్తోంది. ఇక కరోనా వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలే ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. ఈ కరోనా ఎఫెక్ట్‌ భారత పార్లమెంట్‌కు పాకింది. చాలా మంది ఎంపీలు కరోనా ఎఫెక్ట్‌తో మాస్క్‌లతో పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. తాజాగా అమ్రవతి ఎంపీగా ఎన్నికైన టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ రాణా.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలకు మొఖానికి మాస్క్ వేసుకొని సమావేశాలకు హాజరైయింది.