కాశ్మీర్లో షట్టర్స్ క్లోజ్..కఠిన వీకెండ్ లాక్డౌన్ అమలు
కాశ్మీర్లో షట్టర్స్ క్లోజ్..కఠిన వీకెండ్ లాక్డౌన్ అమలు
Weekend Lockdown: కాశ్మీర్ లోయలో వీకెండ్ లాక్డౌన్ అమలవుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. షాపులు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం నుంచే మూసివేశారు.
1/ 7
అనుకున్నట్లుగానే థర్డ్‌వేవ్ దెబ్బకు దేశంలో చాలా రాష్ట్రాలు చాప చుట్టేసే పరిస్థితి వచ్చింది. ఒక్కో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తుంటే కాశ్మీర్ లోయలో పరిపాలన అధికారులు వారాంతపు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.
2/ 7
శుక్రవారం మధ్యాహ్నం నుంచే అమల్లోకి తెచ్చారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత నుంచి సోమవారం అనగా 24జనవరి ఉదయం 6గంటల వరకూ అన్నీ వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూసివేసి ఉంటాయని ప్రకటించారు.
3/ 7
శ్రీనగర్‌లో గురువారం రాత్రిలోగా కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ సెక్రట్రీ డాక్టర్ అరుణ్‌కుమార్ మెహతా వెల్లడించారు.
4/ 7
శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సోమవారం ఉదయం 6:00 గంటల వరకు మొత్తం జమ్మూతో పాటు కాశ్మీర్లో అనవసర రాకపోకలపై పూర్తి ఆంక్షలు విధించారు.
5/ 7
కోవిడ్ నిబంధనలు అమలు జరిగేలా చూసేందుకు సైనిక, భద్రత దళాలు గస్తీ కాస్తున్నారు. అత్యవసర సరుకులు రవాణా వాహనాల మినహాయించి ఎలాంటి వాటికి ప్రవేశం లేదని తేల్చి చెప్పారు అధికారులు.
6/ 7
కాశ్మీర్ లోయలోని ప్రజలతో పాటు పాజిటివ్ రోగుల కోసం ఎస్వోపీ అనుసరించడానికి మార్గదర్శకాలను కూడా జారీ ప్రతి చోట వైద్య సదుపాయాలను మెరుగుపరిచింది.
7/ 7
కాశ్మీర్ లోయలో మూడ్రోజుల్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే వీకెండ్ లాక్డౌన్ ఎత్తివేస్తారు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైతే లాక్డౌన్ పొడిగించే అవకాశం లేకపోలేదు.