మాస్క్ ల వాడకం కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించడంతో చాలా మంది ధరిస్తున్నారు. అయినా కేసులు ఆగడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది.. మనం మాస్క్ ల విషయంలో ఏమైనా పొరపాటు చేస్తున్నామా అనే సందేహాలు వస్తున్నాయి. మాస్కు ధారణ, కరోనాను ఎదుర్కోనే విషయంలో ప్రజలు చేస్తున్న తప్పులను వైద్య నిపుణులు తెలియజేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
1. మాస్క్ ధరించిన తర్వాత అస్సలు తీయొద్దు. కేవలం ఆహారం తీసుకునేటప్పుడు లేదా ఏదైనా తాగేటప్పుడు మాత్రమే మాస్కుని తియ్యాలి. చాలా మంది మాట్లాడేటప్పుడు మాస్క్ ను కిందకు గుంజడం వల్ల చేతులకు ఉన్న వైరస్ ముఖం నుంచి ముక్కు దాకా వెళ్లి కరోనా బారిన పడే అవకాశం అందని గుజరాత్ లోని ప్రముఖ్ స్వామి మెడికల్ కాలేజీ డాక్టర్ హర్యాక్స్ పాఠక్ చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)