Lockdown: రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్.. కోవిడ్ ఆంక్షలపై క్లారిటీ ఇచ్చిన సీఎం
Lockdown: రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్.. కోవిడ్ ఆంక్షలపై క్లారిటీ ఇచ్చిన సీఎం
Maharashtra covid Updates: మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మన దేశంలో వస్తున్న మొత్తం కేసుల్లో 25శాతం ఇక్కడే ఉంటున్నాయి. ముంబైలో కోవిడ్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో లాక్డౌన్పై సీఎం ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యలో అక్కడి ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో త్వరలోనే అక్కడ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
లాక్డౌన్ ప్రచారంలో సీఎం ఉద్ధవ్ థాక్రే క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్రలో లాక్డౌన్ విధించే ఉద్దేశం లేదని.. లాక్డౌన్తో పనిలేకుందా కరోనాను కట్టడి చేయడంపైనే దృష్టి సారించామని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
లాక్డౌన్తో జనజీవనాన్ని దెబ్బతినే ప్రమాదం ఉందని..అందుకే లాక్డౌన్ గురించి ఆలోచించడం లేదని సీఎం తెలిపారు. కానీ ప్రజలు గుంపులుగా ఉండకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి బాగా పెరిగిందని.. లక్షణాలపై ప్రజలు దృష్టి పెట్టాలని సీఎం ఉద్ధవ్ థాక్రే విజ్ఞప్తి చేశారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ధర్డ్ వేవ్ నేపథ్యంలో తమిళనాడులో ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ పాటిస్తున్నారు. అక్కడి కంటే ఎక్కువ కేసులే ముంబైలో వస్తున్నాయి. ఐనప్పటికీ అక్కడ ఎలాంటి వీకెండ్ లాక్డౌన్ విధించలేదు. ఇప్పటికైతే వీకెండ్ లాక్డౌన్ అవసరం లేదని బీఎంసీ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ముంబైలో ప్రస్తుతం స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. థియేటర్లను కూడా మూసివేశారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ( ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
మహారాష్ట్రలో నిన్న 41,434 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 9,671 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరో 13 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,76,948 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)