మన దేశం కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ డెల్టా ప్లస్ వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. వేగంగా ఇతర ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మళ్లీ అప్రమత్తవుతున్నాయి. మళ్లీ కరోనా ఆంక్షలను విధిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మహారాష్ట్రలో తొలి మరణం నమోవడం.. కేసుల పెరుగుతుండడంతో ఉద్దవ్ థాక్రే సర్కార్ అప్రమత్తమయింది. లెవెల్ 3 కింద మళ్లీ ఆంక్షలను విధిస్తున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత షాపులన్నీ మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెస్టారెంట్లకు 50 శాతం సీటింగ్‌తో సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదైన రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేస్తోంది. జన సమూహాలను నియంత్రించడంతో పాటు పెద్ద ఎత్తున పరీక్షలు చేయాలని, టీకాలను పెంచాలని సూచించింది. ఈ మేరకు కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్, ఏపీ, కశ్మీర్, గుజరాత్, హరియాణా ప్రభుత్వాలకు ఆరోగ్యశాఖ లేఖ రాసింది.(image credit - twitter - reuters)