దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో... కొన్ని నగరాల్లో మాత్రం ఆ వైరస్ ప్రభావం తగ్గుతోందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
వీటితో పాటు పాటు దక్షిణ భారతంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా కరోనా తగ్గుముఖం పడుతోందని స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
అయితే కరోనా తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్పమత్తంగానే ఉండాలని, లేకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
మునుపటితో పోల్చితే ఆయా నగరాల్లో రోజువారీ కరోనా కేసులు చాలా వరకు తగ్గుతున్నాయని... అంతమాత్రాన ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం మానేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
కచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. మాస్కులు లేనిదే బయటకు వెళ్లరాదు. శానిటైజేషన్, క్లీన్ ఎన్విరాన్మెంట్ వంటి నియమాలను కచ్చితంగా పాటించాలని అని గులేరియా వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
కొన్ని చోట్ల కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా.. బీహార్, అస్సాం వంటి చోట్ల కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. కేసులు పెరిగినా... తగ్గినా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
బీసీజీ వ్యాక్సిన్ కారణంగా భారతీయుల్లో రోగ నిరోధిక శక్తి మరింత మెరుగ్గా ఉండొచ్చని రణ్ దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
చలికాలంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉండే అవకాశం ఉందన్న రణ్‌దీప్ గులేరియా... శీతాకాలంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)