Curfew extends in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా (Corona) వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్ లో రాష్ట్రవ్యాప్తంగా 60,350 శాంపుల్స్ ని పరీక్షించగా 1,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005, భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం కింద చర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రోడ్డుపైకి రావడం విషయంలోనే కాదు.. అందరూ తప్పక మాస్క్ ధరించాలని.. మాస్కు లేకుండా కనిపిస్తే ఫేన్లు తప్పవని స్పష్టం చేశారు అధికారులు.
ఇకపై పెళ్లిళ్లకు 150 మందికి మాత్రమే పర్మిషన్ ఉందని సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఒకవేల తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తు అనుమతి తప్పనిసరి అని వెల్లడించారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక అధికారులు నిఘా తప్పని సరి అన్నారు.
ఎవరైనా కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై సంబంధిత అధికార వర్గాలు చర్యలు తీసుకుంటారు. పోలీసులు శాఖ సమాన్య ప్రజలకూ అవకాశం కల్పిస్తోంది. మాస్కు లేకుండా రోడ్డుపైకి వచ్చే వారి ఫోటోలను తీసీ.. సంబంధింత జిల్లా అధికారులకు పంపిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తోంది.