ఏపీలో కర్ఫ్యూ ను మరో పది రోజులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జూన్ 10తో కర్ఫ్యూ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం జగన్. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించాలని సీఎం నిర్ణయించారు. అలాగే సడలింపులపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతులు ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఎవరైనా రోడ్డుపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. అత్యవసరం ఉందని రుజువులు చూపించినా.. అనుమతులు ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. కానీ ఇకపై మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సమయాన్ని పెంచారు. అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసారల కోసం రోడ్డుపైకి వెళ్లే వెసులుబాటు దక్కింది.
తాజాగా ఏపీలో కరోనా కేసులు భాగానే కట్టడి అవుతున్నాయని.. మరింత అప్రమత్తంగా ఉంటే పూర్తిగా కట్టడి సాధించవచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. సండలింపుల్లో మార్పులు చేసినా.. మధ్యాహ్నం తరువాత స్ట్రిక్ట్ గా నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని హెచ్చరించారు.
ప్రస్తుతం ఏపీలో కఠిన కర్ఫ్యూ ఫలితాలను ఇస్తోంది. వారం రోజుల కిందటి వరకు ప్రతి రోజూ 20 వేలకు పైగా మంది కరోనా బారిన పడే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి లో మార్పు కనిపించింది. నిలకడగా పది వేల లోపే కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఊహించిన స్థాయిలో తగ్గడం లేదు. 90కు అటు ఇటుగా నమోదవుతూనే ఉన్నాయి. అందుకే కర్ఫ్యూను మరింత కాలం పొడిగించడమే మేలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఆదివారం కరోనా కేసులు తగ్గాయి. పలు జిల్లాల్లో ప్రస్తుతం వందల్లోనే కేసులు నమోదు అవుతున్నాయి. మరికొన్ని రోజులు కఠినంగా కర్ఫ్యూ అమలు చేయగలిగితే అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి వస్తుందన్నారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు.