Covishield Vaccine: గుడ్‌న్యూస్.. కోవిషీల్డ్ టీకా ధరల తగ్గింపు.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరట..

కరోనా టీకా ధరలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ దేశంలో తయారైన టీకాలను ఇక్కడే ఎక్కువ ధరకు అమ్ముతారా? అని ప్రజలు మండిపడుతున్నారు. ఒక కంపెనీకి చెందిన టీకాను వేర్వేరు ధరలకు ఎలా అమ్ముతారంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కోర్టులు కూడా విమర్శించాయి. ఈ క్రమంలోనే సీరం ఇన్‌స్టిట్యూట్ దిగొచ్చింది. టీకా ధరలను తగ్గించింది.