దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. ఇప్పటికే రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి ఏకైక మార్గంగా ఉన్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి ప్రభుత్వాలు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం ఒమిక్రాన్ కొత్త వేరియంట్ సోకడం ఆందోళనకరంగా మారింది.(ప్రతీకాత్మక చిత్రం)
దీంతో కరోనా సోకిన వారు పూర్తిగా కోలుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రెండు కొత్త మందులను సిఫార్సు చేసింది. కాసిరివిమాబ్, బారిసిటినిబ్ అనే రెండు మందులతో తీవ్రమైన అనారోగ్యం, ప్రాణాపాయం నుంచి కోవిడ్ రోగులను కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
ఏ మందులు ఉపయోగించకూడదు..?
ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినావిర్/రిటోనావిర్, రెమ్‌డెసివిర్ వంటి మందులు కోవిడ్ మరణాలు లేదా ఆసుపత్రిలో చేరే రేటును తగ్గిస్తాయనడంలో ఎటువంటి రుజువు లేనందున డబ్ల్యూహెచ్ఓ వీటిని సిఫార్సు చేయలేదు. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రం క్లినికల్ ట్రయల్ కోసం సిఫార్సు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)