India Corona updates: నిన్న ఒక్కరోజే 2,796 కరోనా మరణాలు.. కోవిడ్ తాజా బులెటిన్
India Corona updates: నిన్న ఒక్కరోజే 2,796 కరోనా మరణాలు.. కోవిడ్ తాజా బులెటిన్
India Corona updates: ఒమిక్రాన్ టెన్షన్ పెడుతున్నప్పటికీ మన దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు 9వేల లోపే వస్తున్నాయి. ఐతే రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అంతేేేకాదు నిన్న ఒక్కరోజే భారీగా మరణాలు నమోదయ్యాయి. దానికి కారణమేంటో తెలుసుకుందాం.
India Corona cases: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 8,895 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 8,190 మంది కోలుకున్నారు. 2,796 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజే ఇన్ని మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,33,255 కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,40,60,774 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,73,326 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 99,155 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
కొన్ని రోజులుగా రికవరీ కంటే కొత్త కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో యాక్టివ్ కేసులు లక్ష లోపే వస్తున్నాయి. ఒకవేళ కేసులు ఇలాగే కొనసాగితే యాక్టివ్ కేసులు మళ్లీ లక్ష దాటే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇవాళ్టి బులెటిన్‌లో ఎక్కువ మరణాలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారంత నిన్న ఒక్కరోజే చనిపోలేదు. బీహర్ ప్రభుత్వం 2424 బ్యాక్ లాక్ మరణాలను నమోదు చేసింది. కేరళ 225, మహారాష్ట్ర 84 బ్యాక్ లాగ్ మరణాలను నమోదు చేయడం వల్లే మరణాల సంఖ్య భారీగా కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నిన్న కేరళలో 4,557 కేసులు నమోదయ్యాయి. 215 మరణాలు నమోదయ్యాయి. ఇందులో బ్యాక్లాగ్ మరణాలే ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడులో 731, మహరాష్ట్రలో 782 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
భారత్‌లో నిన్న 12,26,064 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 64.72 లక్షల మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 1,04,18,707 మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 127.61 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)