COVID19 INDIA REPORTS 24354 NEW CASES IN THE LAST 24 HOURS ACTIVE CASELOAD AT 273889 LOWEST IN 197 DAYS SK
Coronavirus: భారీగా తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు.. నేటి కోవిడ్ బులెటిన్ వివరాలు..
India Covid-19 updates: మన దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. యాక్టివ్ కేసులు భారీగా తగ్గడం ఊరట కలిగించే విషయం. మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు?
భారత్లో శుక్రవారం 24,354 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 25,455 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 234 మంది మరణించారు. కొత్త కేసులు వరుసగా 8వ రోజు 30వేల లోపే నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
యాక్టివ్ కేసులు భారీగా తగ్గడం శుభపరిణామం. గత ఆరు రోజులుగా యాక్టివ్ కేసు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు 197 రోజుల కనిస్టానికి చేరుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
యాక్టివ్ కేసులు భారీగా తగ్గడం శుభపరిణామం. గత ఆరు రోజులుగా యాక్టివ్ కేసు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు 197 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
మన దేశంలో ఇప్పటి వరకు 3,37,91,061 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 3,30,68,599 మంది కోలుకోగా.. 4,48,573 మంది మరణించారు. ప్రస్తుతం భారత్లో 2,73,889 యాక్టివ్ కేసులున్నాయి.(image credit - twitter - reuters)
5/ 8
కేరళలో నిన్న 13,834 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే దేశంలో నమోదైన కేసుల్లో సగానికిపైగా ఇక్కడే ఉన్నాయి. కేరళ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ 3,105 మందికి పాజిటివ్ వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
శుక్రవారం దేశవ్యాప్తంగా 14,29,258 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉంది. గత 5 రోజులుగా 2శాతం కంటే తక్కువగానే నమోదవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఇక వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న 69,33,838 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు మనదేశంలో 89.74 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)