COVID19 INDIA REPORTS 10929 NEW CASES 392 DEATHS AND 12509 RECOVERIES IN THE LAST 24 HOURS SK
India Corona Cases: గుడ్ న్యూస్.. 10వేలకు తగ్గిన రోజువారీ కేసులు.. తాజా బులెటిన్ ఇదే
India corona updates: ప్రపంచమంతటా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. భారత్‌లో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ కేసులు మరింతగా తగ్గి.. 10వేలకు చేరుకున్నాయి. ఇది ఊరటనిచ్చే విషయం. మరి నిన్న ఎంత మందికి పాజిటివ్ వచ్చింది? ఎన్ని మరణాలు నమోదయ్యాయి? వంటి వివరాలను ఇక్కడ చూద్దాం.
India Corona cases: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 10,929 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే 14శాతం తగ్గాయి. 12,509 మంది కోవిడ్ మహమ్మారి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 392 మరణాలు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్త కరోనా కేసుల సంఖ్య 3,43,44,683 కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,37,37,468 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,60,265 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 1,46,950 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
యాక్టివ్ కేసుల సంఖ్య 1,970 మేర తగ్గింది. ఐతే వరుసగా 9వ రోజు 15వేల లోపే కేసులు నమోదయ్యాయి. అంతేకాదు యాక్టివ్ కేసులు 255 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
కేరళలోనూ కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న కేరళలో 6,580 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో వెయ్యి లోపే కేసులు వచ్చాయి. నిన్న మహారాష్ట్రలో 1,145 మందికి పాజిటివ్ వచ్చింది. ఐతే 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నిన్నటితో పోల్చితే ఇవాళ టెస్ట్ పాజిటివిటీ రేటు తగ్గింది. నిన్నటి బులెటిన్‌లో 1.90శాతంగా ఉండగా..ఇవాళ 1.35 శాతంగా ఉంది. మిజోరాం (10.97 %), కేరళ (10.46 %), మణిపూర్‌లో (3.56 %) మాత్రం పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది.
6/ 7
భారత్‌లో నిన్న 8,10,783 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 61.38 లక్షల మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 20,75,942 మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 107 కోట్ల 92 లక్షలకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)