ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఎక్కువ కరోనా కేసులు వచ్చిన మూడో దేశం, దక్షిణ అమెరికా ఖండంలోని కీలక దేశమైన బ్రెజిల్ వెళ్దాం. అక్కడో చిత్రమైన కేసును తెలుసుకుందాం. అక్కడి ప్రభుత్వ అధికారులు సడెన్గా షాక్ అయ్యారు. ఎందుకంటే... ఊరూ, పేరూ లేని ఓ వ్యక్తి... మే, జూన్లో వరుసగా కరోనా వ్యాక్సిన్ డోసులు పొందాడు. తాజాగా మరో డోస్ కోసం వచ్చాడు. ఏమీ ఎరగని వాడిలా వ్యాక్సినేషన్ కేంద్రంలో కూర్చున్నాడు. అంతలో... సిబ్బందిలో ఒకరు... అతని చిట్టా చూశారు. షాక్ అయ్యారు. ఎందుకంటే... అతను ఇప్పటివరకూ 3 రకాల వ్యాక్సిన్లు 5 డోసులు పొందాడు. ( symbolic image credit - twitter - reuters)
బ్రెజిల్ మీడియా ప్రకారం... అతనికి మే 12న ఫైజర్ టీకా ఇచ్చారు. జూన్ 5న కోవిషీల్డ్ ఇచ్చారు. ఆ తర్వాత.. జూన్ 17న కోవిషీల్డ్ సెకండ్ డోస్ ఇచ్చారు. జులై 9న ఫైజర్ టీకా సెకండ్ డోస్ ఇచ్చారు. మళ్లీ జులై 21న కరోనావ్యాక్... మొదటి డోస్ పొందాడు. ఇప్పుడు ఆరోసారి వచ్చినప్పుడు అతను కరోనావ్యాక్ సెకండ్ డోస్ కోసం వచ్చాడా లేక... మరేదోనా కొత్త వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకోవడానికి వచ్చాడా అన్నది తేలలేదు. (image credit - twitter - reuters)
అసలు ఇన్నిన్నిసార్లు అతను వస్తుంటే... అధికారులకు ఎందుకు తెలియలేదు అన్న డౌట్ మనకు రావచ్చు. ఏమైందంటే... ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఓ లోపం ఉంది. ఆ ఎర్రర్ని అడ్డు పెట్టుకొని.. ఇన్నిసార్లు వేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏ లోపమూ లేదని అధికారులు అంటున్నారు. మరి లోపం లేకపోతే... అతను ఎలా చేశాడన్నది తేలాల్సి ఉంది. (image credit - twitter - reuters)
ఐతే... మొదటిసారి, రెండోసారి డోసులు వేసుకున్న సమయంలో... ఆన్లైన్ లేదు. అప్పుడు ఆస్పత్రికి వచ్చినప్పుడు అతన్నే వివరాలు అడిగి ఓ చోట రాసుకున్నారు. అప్పుడు అతను వచ్చినప్పుడల్లా... ఇదే మొదటిసారి అంటూ చెప్పసాగాడు. అతను చెప్పిందే నిజం అనుకున్నారు. దాంతో అసలు లెక్కలు బయటకు రాలేదు. (image credit - twitter - reuters)
తాజాగా బ్రెజిల్లో వ్యాక్సి్న్ల కొరత బాగా వచ్చింది. అందువల్ల ఎవరికి ఏ డోస్ వెయ్యాలన్నా అన్నీ చెక్ చేసి వేస్తున్నారు. ఆ క్రమంలో అతనికి ఏ డోస్ వెయ్యాలి అనేది పరిశీలించగా... రహస్యం బట్టబయలైంది. బ్రెజిల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి అంటోంది అక్కడి మీడియా. కానీ... ఇలా మూడు రకాల వ్యాక్సిన్లను ఐదు డోసులు తీసుకున్న కేసు ఇదే మొదటిది కావచ్చు. ఇన్ని వేసుకున్నా అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ కేసును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. (image credit - twitter - reuters)