ప్రపంచవ్యాప్తంగా నిన్న 3,51,592 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 11.52 కోట్లు దాటింది. నిన్న 8,967 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 25.59 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.16 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. అమెరికాలో నిన్న 52,070 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2.93 కోట్లు దాటింది. నిన్న1,817 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 5.29 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్ (58,237) టాప్‌కి చేరగా ఆ తర్వాత అమెరికా రెండో స్థానానికి చేరింది. ఆ తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (1,817) టాప్‌లో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ (1726), రష్యా (441), మెక్సికో (437), జర్మనీ (401) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (image credit - twitter - reuters)