Omicron: అమెరికా వెళ్లే వారికి అలర్ట్.. ఒమిక్రాన్ నేపథ్యంలో కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి
Omicron: అమెరికా వెళ్లే వారికి అలర్ట్.. ఒమిక్రాన్ నేపథ్యంలో కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి
Omicron Variant: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అందరూ ఊపిరిపీల్చుకుంటున్న వేళ ఒమిక్రాన్ వేరియెంట్ వచ్చి పడింది. అత్యంత ప్రమాదకరమైన ఒమిక్రాన్‌తో యావత్ ప్రపంచం అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఒమిక్రాన్ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు విధించింది. భారత్ సహా ఏ దేశాల నుంచి వచ్చే వారైనా ఖచ్చితంగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ లేదా 90 రోజుల వ్యవధిలో వైరస్ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు తీసుకెళ్లాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ కొత్త రూల్స్ నిబంధనలు డిసెంబర్ 6 నుంచే అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (HHS)లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
రెండేళ్లు, ఆపై వయసున్న ప్రయాణికులందరికీ ఈ కొత్త నిబంధనలను వర్తిస్తాయని అమెరికా అధికారులు చెప్పారు. కోవిడ్ నెగెటివ్ రిపోర్టు కూడా ప్రయాణానికి ఒకరోజు ముందు తీయించుకున్నదై ఉండాలి. అంతకు ముందే తీయించినది అయితే అమెరికాలోకి ఎంట్రీ ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
అమెరికాలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. మసాచుసెట్స్, వాషింగ్టన్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే అత్యధిక ఒమిక్రాన్ వేరియంట్ కేసులున్నాయి. సౌతాఫ్రికాలో 227, యూకేలో 160 మందిలో ఈ వేరియెంట్ బయటపడింది. ఇక జింబాబ్వేలో 50, అమెరికాలో 38, ఘనాలో 33 కేసులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)