Covid Vaccination: వ్యాక్సిన్ వేస్టేజ్‌లో ఈ రాష్ట్రమే నెంబర్ వన్.. ఏకంగా 37శాతం వృథా

మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇస్తామని చెప్పినా క్షేత్రస్థాయలో ఎక్కడా అమలు కావడం లేదు. మొదటి డోస్ తీసుకున్న వారికే రెండో డోస్ దొరకడం లేదు. టీకాలు లేక వ్యాక్సినేషన్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉన్న వ్యాక్సిన్‌నే వృథా చేస్తున్నాయి.