Corona Updates: థర్డ్ వేవ్ లేనట్లే.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. తాజా బులెటిన్ వివరాలు
Corona Updates: థర్డ్ వేవ్ లేనట్లే.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. తాజా బులెటిన్ వివరాలు
India Corona Updates: ప్రపంచమంతటా ఒమిక్రాన్ భయం నెలకొన్నా.. మన దేశంలో మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. మరి నిన్న దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.
India Corona cases: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 6,974 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,995 మంది కోలుకున్నారు. 252 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే కరోనా కేసులు భారీగా తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,03,644కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,41,38,763 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,75,888 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 88,993 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా నమోదయింది. నిన్నటి బులెటిన్‌లో 0.58 శాతంగా ఉంది. గత 16 రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 1 లోపే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో నిన్న 1,34,790 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 65.76 లక్షల మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 66,98,601 మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 133.88 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)