దేశంలో కరోనా ఉధృతి కొద్దికొద్దిగా తగ్గుతున్నా.. ఈ మహమ్మారి తన రూపాన్ని మార్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ కారణంగా ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో తొలి మరణం నమోదైంది.(ప్రతీకాత్మక చిత్రం )
2/ 4
తాజాగా ఇదే రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రెండో మరణం సంభవించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారులు ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం )
3/ 4
మధ్య ప్రదేశ్ నుంచి 1,219 నమునాలను సేకరించి జీనోమ్ సీక్వేన్సింగ్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ డిసిజ్ కంట్రోల్‌కు పంపించారు. దీనిలో 31 శాతం నమునాలు ఆందోళనకరంగా ఉన్నట్లు ఎన్సీడీసీ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం )
4/ 4
మధ్యప్రదేశ్‌లో నమోదైన 6 డెల్డా వేరియంట్ కేసులలో భూపాల్‌లో 2 కేసులు, ఉజ్జయినిలో 2 కేసులు, శివపూరి సమీపంలోని రైసన్, అశోక్‌నగర్‌ల నుంచి ఒక్కో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. (ప్రతీకాత్మక చిత్రం )