World Covid: ప్రపంచ దేశాల్ని కరోనా వదలట్లేదు. అమెరికాలో రోజూ లక్ష దాకా కొత్త కేసులు వస్తున్నాయి. టెస్టుల సంఖ్య తగ్గినప్పుడు మాత్రమే కొత్త కేసుల సంఖ్యా తక్కువగా నమోదవుతోంది. కొత్తగా ఇరాన్లో కరోనా విపరీతంగా పెరుగుతోంది. అటు ఇండొనేసియాలో మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక థాయిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్ వంటి తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ కరోనా జోరు పెరుగుతోంది. కరోనాపై చాలా సీక్రెట్ మెయింటేన్ చేస్తున్న చైనాలో నిన్న 51 కొత్త కేసులు వచ్చాయి. అక్కడ కూడా డెల్టా వేరియంట్ ప్రభావం చూపిస్తోంది. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 45,962 టెస్టులు చెయ్యగా... కొత్తగా 909 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,94,606కి చేరింది. కొత్తగా 13 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,660కి చేరింది. కొత్తగా 1,543 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,63,728కి చేరింది. ప్రస్తుతం 17,218 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,57,08,411 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 405 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,52,785కి చేరాయి. కొత్తగా 577 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,41,847కి చేరింది. రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ముగ్గురు మరణించారు. మొత్తం మరణాలు 3,845కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,093 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో నిన్న కొత్తగా 4,78,741 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20.85 కోట్లు దాటింది. కొత్తగా 7,359 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 43.82 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.71 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 68,409 కేసులు, 237 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 14,471 కొత్త కేసులు, 274 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)