CORONAVIRUS UPDATES MAHARASHTRA REPORTS 57640 FRESH COVID19 POSITIVE CASES AND 920 DEATHS SK
Corona Deaths: ఒక్కరోజే 920 మంది మృతి.. మహారాష్ట్రలో మరణ మృదంగం
Covid-19 Deaths: మహారాష్ట్రలో కోవిడ్ మహమ్మారి భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త కేసులు పెరగడంతో పాటు కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్నారు. సకాలంలో వైద్యం అందక.. ఆక్సిజన్ చాలక...చాలా మంది మరణిస్తున్నారు.
మహారాష్ట్రలో కోవిడ్ మహమ్మారి భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త కేసులు పెరగడంతో పాటు కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్నారు. సకాలంలో వైద్యం అందక.. ఆక్సిజన్ చాలక...చాలా మంది మరణిస్తున్నారు.
2/ 5
మహారాష్ట్రలో బుధవారం 57,640 మందికి కరోనా నిర్ధారణ అయింది. 57,006 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 920 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు ఇవే అత్యధిక మరణాలు.
3/ 5
రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,80,542 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 41, 64,098 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 72,662 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 6,41,596 యాక్టివ్ కేసులున్నాయి.
4/ 5
కఠిన లాక్డౌన్ వల్ల ముంబైలో నిన్నటి వరకు కరోనా కేసులు తగ్గాయి. కానీ బుధవారం మళ్లీ కొంత పెరిగాయి. బీఎంసీ పరిధిలో 3,897 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 3,686 మంది కోలుకోగా.. 77 మంది మరణించారు.
5/ 5
ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,65,299కి చేరింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 5,98,545 మంది కోలుకున్నారు. 13,547 మంది మరణించారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 13,547 యాక్టివ్ కేసులున్నాయి. లాక్డౌన్ వల్ల ముంబై సిటీలో కరోనా ఉద్ధృతి కొంత వరకు తగ్గింది.