HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES COVID 19 DAILY TESTS CASES DEATHS DEATH RATE DECREASE MORE IN TELANGANA NK
Telangana Covid 19: తెలంగాణలో తగ్గిన డైలీ కరోనా టెస్టులు, కేసులు, మృతులు, మరణాల రేటు
Coronavirus updates: కరోనా వైరస్‌కి బ్రేక్ వేసేందుకు తెలంగాణ ప్రజలు చాలా సీరియస్‌గా ఉన్నారు. పల్లె పల్లెల్లో కూడా కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఫలితంగా కొత్త కేసులు, మరణాలూ తగ్గుతున్నాయి.
News18 Telugu | October 24, 2020, 9:43 AM IST
1/ 3
తెలంగాణ ప్రజల కృషి ఫలిస్తోంది. క్రమంగా కరోనా వైరస్‌పై రాష్ట్రం పై చేయి సాధిస్తోంది. తాజాగా నిన్న 35,280 శాంపిల్ టెస్టులు చెయ్యగా... 1273 మందికి కొత్తగా కరోనా వచ్చింది. మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2,30,274కి చేరింది. నిన్న కరోనాతో ఐదుగురు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1303కి చేరింది. ఐతే... మరణాల రేటు మరింత తగ్గి... 0.56 శాతానికి చేరింది. దేశంలో అది 1.5 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 1708 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,09,035కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 90.77 శాతానికి చేరింది. దేశంలో అది 89.7 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 19937 ఉన్నాయి. వాటిలో 16809 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. (credit - NIAID)
2/ 3
తెలంగాణ ప్రభుత్వం నిన్న 32500 కరోనా టెస్టులు చేసింది. 1088 టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో... 21 నుంచి 40 ఏళ్ల మధ్యవారికి ఎక్కువగా కరోనా సోకుతోంది. మొత్తం యాక్టివ్ కేసులలో వీరు 46 శాతం ఉన్నారు. కరోనా వల్ల చనిపోతున్న వారిలో... కేవలం కరోనాతో చనిపోతున్న వారు 44.96 శాతం ఉండగా... ఇతర వ్యాధులు ఉండి కరోనాతో చనిపోతున్న వారు 55.04 శాతం ఉన్నారు.
3/ 3
జిల్లాల వారీగా 24 గంటల్లో పరిస్థితి చూస్తే... GHMCలో కొత్తగా 227 పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే... మేడ్చల్ మల్కాజిగిరిలో 104, రంగారెడ్డి జిల్లాలో 102 కేసులొచ్చాయి. మిగతా జిల్లాల్లో 100 కంటే తక్కువ కేసులే వచ్చాయి. నారాయణ్ పేట జిల్లాలో అతి తక్కువగా 3 కేసులే వచ్చాయి.