మనిషి చేసిన పాపానికి మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా అమెరికాలోని ఉటాహ్, విస్కాన్సిన్ ప్రాంతాల్లో 10,000కు పైగా నీటి కుక్కలు మరణించాయి. అయితే వీటి మరణం వెనుక కరోనావైరస్ సంక్రమణే కారణమని రిపోర్టులు వస్తున్నాయి. ఉటాహ్ లో, కోవిడ్ -19 కారణంగా 8,000 నీటి కుక్కలు మరణించగా, విస్కాన్సిన్లో రెండు వేల నీటి కుక్కలు చనిపోయాయి. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. కాని దాని శరీరంపై సిల్కీ జుట్టు కలిగి ఉంటాయి. వాటి జుట్టు స్ప్లాష్ డిజైన్లతో ఉంటుంది.