HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS PANDEMIC INDIAN RAILWAYS TRAIN COACH INTO ISOLATION WARD SEE PICS SS
Train Hospital: రైలు బోగీనే ఆస్పత్రిగా మార్చిన ఇండియన్ రైల్వేస్
Train Hospital | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సంక్షోభం నెలకొనడంతో భారత ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ముందు జాగ్రత్తగా ప్రత్యేక వార్డుల్ని సిద్ధం చేస్తోంది. భారతీయ రైల్వే ట్రయల్ పద్ధతిలో నాన్ ఏసీ ట్రైన్ కోచ్‌ను ఐసోలేషన్ వార్డుగా మార్చింది. ఆ ఫోటోలు చూడండి.
News18 Telugu | March 30, 2020, 5:18 PM IST
1/ 12
1. ఇండియన్ రైల్వేస్ రైలు బోగీలను ఐసోలేషన్ వార్డుగా మార్చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రయోగాత్మకంగా రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. (image: Indian Railways)
2/ 12
2. ప్రస్తుతానికి ఓ బోగీని ఐసోలేషన్ వార్డుగా మార్చి నమూనాను రూపొందించింది. ఒకవేళ దీనికి ఆమోదముద్ర పడితే ప్రతీ రైల్వే జోన్లో వారానికి 10 కోచ్‌లు సిద్ధం చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. (image: Indian Railways)
3/ 12
3. ప్రతీ నాన్ ఏసీ కోచ్‌లో 9 కంపార్ట్మెంట్స్, 4 టాయిలెట్స్ ఉంటాయి. వాటిలో రెండింటిని బాత్రూమ్స్గా మార్చారు. ప్రతీ క్యాబిన్లో 6 బెర్తులతో 10 క్యాబిన్స్ ఉంటాయి. పేషెంట్లకు, మెడికల్ సిబ్బందికి వేర్వేరు క్యాబిన్స్ ఉంటాయి. (image: Indian Railways)
4/ 12
4. ప్రతీ కంపార్ట్మెంట్ను అవసరమైతే ఒక క్యూబికల్గా మారుస్తామంటోంది రైల్వే. ఒక కంపార్ట్మెంట్ను వైద్య సిబ్బంది కోసం నర్సింగ్ స్టేషన్‌గా మారుస్తామంటోంది. చిన్నచిన్న మార్పులు చేస్తే ప్రతీ కోచ్‌లో 8 మంది పేషెంట్లకు చికిత్స అందించొచ్చని రైల్వే చెబుతోంది. (image: Indian Railways)
5/ 12
5. పేషెంట్ క్యాబిన్ తయారు చేసేందుకు ఒకవైపు మిడిల్ బెర్త్, మరోవైపు మూడు బెర్తులు, ల్యాడర్స్ తొలగించారు. ప్రతీ క్యాబిన్‌కు ప్లాస్టిక్ కర్టైన్ ఏర్పాటు చేశారు. (image: Indian Railways)
6/ 12
6. డాక్టర్, నర్స్, మెడికో కమ్ స్టోర్ క్యాబిన్లో మిడిల్ బెర్త్ తొలగించారు. ప్రతీ కంపార్ట్మెంట్కో 220 వోల్డ్ ఎలక్ట్ పాయింట్ ఉంటుంది. (image: Indian Railways)
7/ 12
7. ఒకవేళ కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తే ప్రతీ కోచ్‌లో 16 మంది పేషెంట్లకు వైద్య సేవలు అందించొచ్చు. అంటే 20,000 కోచ్‌లను 3,20,000 బెడ్స్‌గా మార్చి ట్రైన్ హాస్పిటల్స్ని అందుబాటులోకి తీసుకొస్తామంటోంది రైల్వే. (image: Indian Railways)
8/ 12
8. ట్రైన్ కోచ్‌ను ఆస్పత్రిగా మార్చిన రైల్వే. (image: Indian Railways)
9/ 12
9. ట్రైన్ కోచ్‌ను ఆస్పత్రిగా మార్చిన రైల్వే. (image: Indian Railways)
10/ 12
10. ట్రైన్ కోచ్‌ను ఆస్పత్రిగా మార్చిన రైల్వే. (image: Indian Railways)
11/ 12
11. ట్రైన్ కోచ్‌ను ఆస్పత్రిగా మార్చిన రైల్వే. (image: Indian Railways)
12/ 12
12. ట్రైన్ కోచ్‌ను ఆస్పత్రిగా మార్చిన రైల్వే. (image: Indian Railways)