CORONAVIRUS MUMBAI BMC COMMISSIONER GIVES CLARITY ON FRESH LOCKDOEN IN MUMBAI CITY SK
Lockdown: ముంబైలో లాక్డౌన్.. క్లారిటీ ఇచ్చిన బీఎంసీ.. అప్పటి వరకు అంతే..
Maharashtra Corona Updates: మహారాష్ట్రపై కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. కేసుల సంఖ్య ఊహకందని విధంగా పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే.. లాక్డౌన్ తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబైలో లాక్‌డౌన్‌పై బీఎంసీ స్పష్టత ఇచ్చింది.
మహారాష్ట్రలో మళ్లీ కరోనా కల్లోలం నెలకొంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై బృహన్ ముంబై కార్పొరేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ముంబైలో హాస్పిటలైజేషన్ రేటు 5 శాతం లోపే ఉందని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. చాలా మంది బాధితులు హోంఐసోలేషన్లో ఉంటున్నారని, కొద్ది పాటి జాగ్రత్తలతో వ్యాధి తగ్గుతుందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ముంబైలో పరిధిలో 20వేల హాస్పిటల్స్ బెడ్స్ కరోనా రోగులతో నిండితే.. అప్పుడు లాక్డౌన్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. అప్పటి వరకు లాక్డౌన్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ప్రస్తుతం ముంబైలో లాక్డౌన్ అవసరం లేదని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ ఇది వరకు అన్నారు. లాక్‌డౌన్‌కు వెళ్లకుండా.. ఆంక్షలను అమలు చేస్తూ కరోనా కట్టడి చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న హోంక్వారంటైన్ సమయాన్ని 10 రోజుల నుంచి వారానికి తగ్గిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
కాగా, ముంబైలో కరోనా వ్యాప్తి భయంకరంగా ఉంది. నిన్నటి బులెటిన్‌లో 7,928 కేసులు రాగా.. ఇవాళ ఆ సంఖ్య 10,606కి చేరింది. నిన్న ఇద్దరు వ్యక్తులు కోవిడ్‌తో మరణించారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
మహారాష్ట్రలో ఇవాళ 18,466 కేసులు నమోదయ్యాయి. 4,556 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. నిన్న 20 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 70,005 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం )
7/ 7
మన దేశంలో ఇప్పటి వరకు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించగా.. మహారాష్ట్ర టాప్‌లో ఉంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 653 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే 259 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)