Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 50,848 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,00,28,709కి చేరింది. కొత్తగా 1,358 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,90,660కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 68,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,89,94,855కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 96.6 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్లో 6,43,194 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 19,01,056 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 39 కోట్ల 59 లక్షల 73 వేల 198 టెస్టులు చేశారు. కొత్తగా 54,24,374 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 29 కోట్ల 46 లక్షల 39 వేల 511 వ్యాక్సిన్లు వేశారు. (image credit - NIAID)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,175 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,15,574కి చేరాయి. కొత్తగా 1,771 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,95,348కి చేరింది. రికవరీ రేటు 96.71 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 10 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,586కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,640 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్లో తాజాగా 74,453 టెస్టులు చెయ్యగా... కొత్తగా 4,169 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,57,352కి చేరింది. కొత్తగా 53 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,416కి చేరింది. కొత్తగా 8,376 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,91,056కి చేరింది. ప్రస్తుతం 53,880 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,12,80,302 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,61,145 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.99 కోట్లు దాటింది. కొత్తగా 7,959 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.97 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.13 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 9,694 కేసులు, 325 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 86,833 కొత్త కేసులు... 2,080 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్ లేదా ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ లేదా ఇండియా మొదటి స్థానంలో ఉంటుంటే... ఆ తర్వాత అర్జెంటినా, కొలంబియా, రష్యా ఉన్నాయి. (image credit - twitter - reuters)