CORONAVIRUS AUSTRALIA UPDATES SYDNEY LOCKDOWN EXTENDED TO 30 SEPTEMBER AS STATE RECORDS 644 NEW CASES SK
Lockdown: అక్కడ సెప్టెంబర్ చివరి వరకు లాక్డౌన్.. వైరస్ వ్యాప్తితో వణుకుతున్న జనం
Lockdown in sydney: మన దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇతర దేశాల్లో మాత్రం డెల్టా వేరియెంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అమెరికాలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో పలు నగరాలు మళ్లీ లాక్డౌన్లోకి వెళ్తున్నాయి.
కరోనా డెల్టా వేరియంట్ విజృంభణతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ వణికిపోతోంది. పెరుగుతున్న కేసులతో ప్రజలతో పాటు ప్రభుత్వంలోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైరస్ను కట్టడిచేయడానికి ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ను పొడిగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
సిడ్నీలో సెప్టెంబర్ చివరి వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
గత రెండు నెలలు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారుు ఎన్నో చర్యలు చేపట్టారు. ఐనా వైరస్ ఉద్ధృతి తగ్గకపోవడంతో లాక్డౌన్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.(image credit - twitter - reuters)
4/ 6
కరోనా విజృంభణ నేపథ్యంలో న్యూ సౌత్వెల్స్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.. (image credit - NIAID - ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఆస్ట్రేలియాలో కొత్తగా 644 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా సిడ్నీలో ఉన్నాయని న్యూ సౌత్వెల్స్ ప్రీమియర్ బెరెజిక్లైన్ వెల్లడించారు. అంతకు ముందు రోజు 681 కేసులు రికార్డయ్యాయని తెలిపారు.(image credit - twitter - reuters)
6/ 6
గత వారం రోజులుగా ప్రతిరోజు 400కుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక ఎక్కువ కేసులు నమోదవుతున్న సిడ్నిలోని 12 లోకల్ కౌన్సిళ్లలో.. సోమవారం నుంచి రాత్రి 9 గంటల నుంచి మరుసటిరోజు 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించారు. (ప్రతీకాత్మక చిత్రం)