HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS 59907 NEW COVID CASES AND 322 DEATHS REPORTED IN MAHARASHTRA IN LAST 24 HRS SK
Coronavirus: మహారాష్ట్రలో భయంకరంగా కరోనా.. ఒక్కరోజే 60వేల కొత్త కేసులు
Coronavirus: మహారాష్ట్రను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. కొత్త కేసులు భయంకరంగా నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 50శాతం పైగా ఒక్క మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి.
News18 Telugu | April 7, 2021, 11:08 PM IST
1/ 5
మహారాష్ట్రను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. కొత్త కేసులు భయంకరంగా నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 50శాతం పైగా ఒక్క మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి.
2/ 5
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 59,907 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క రోజే దాదాపు 60వేల కేసులు వచ్చాయన్న మాట. ఇక ఇవాళ 30,296 మంది వ్యాధి నుంచి కోలుకుంటే..322 మంది మరణించారు. అక్కడ రికవరీల కంటే రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి.
3/ 5
మహారాష్ట్రలో ఇప్పటి వరకు 31,73,261 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 26,13,627 మంది కోలుకోగా.. 56,652 మంది మరణించారు. ప్రస్తుతం 5,01,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
4/ 5
పుణెలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. ఇవాళ ఆ ఒక్క జిల్లాలోనే 10,907 కొత్త కేసులు నమోదయ్యాయి. 7,832 మంది కోలుకోగా.. మరో 62 మంది మరణించారు.
5/ 5
పెరుగుతున్న కేసుల నేపథ్యంలో మహారాష్ట్రలో ఇప్పటికే వారంతాపు లాక్డౌన్ విధించారు. శని, ఆదివారాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుంది. రాత్రిళ్లు 9 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ పాటిస్తున్నారు. సినిమా హాళ్లు, పార్క్‌లు, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. హోటళ్లలో టేక్ అవే సదుపాయం మాత్రమే ఉంది.