HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONA VIRUS VACCINE WILL BE TAKE ONE MORE YEAR TO REACH PEOPLE SAYS CCMB AK
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై సంచలన ప్రకటన.. అప్పటివరకు ఆగాల్సిందే..
CoronaVirus Vaccine: చాలా దేశాల్లో వ్యాక్సిన్ తయారీ ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉందని, వాటన్నింటినీ పూర్తి చేసుకుని అందుబాటులోకి రావాంటే మరో ఏడాది సమయం పటుడుతుందని సీసీఎంబీ సీఈవో మదుసూధన్‌రావు వ్యాఖ్యానించారు.
News18 Telugu | October 22, 2020, 8:04 PM IST
1/ 7
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెల్లడిస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని మన దేశ ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సైతం ఆశాభావం వ్యక్తం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
రష్యా వంటి దేశాల్లో ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆమోదం పొందగా... మరికొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్ తయారీ కీలక దశలకు చేరుకుంది. అయితే వ్యాక్సిన్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అయితే తాజాగా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాక్సిన్‌పై సంచలన ప్రకటన చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
చాలా దేశాల్లో వ్యాక్సిన్ తయారీ ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉందని, వాటన్నింటినీ పూర్తి చేసుకుని అందుబాటులోకి రావాంటే మరో ఏడాది సమయం పటుడుతుందని సీసీఎంబీ సీఈవో మదుసూధన్‌రావు వ్యాఖ్యానించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
కరోనా కేసులు మాత్రమే తగ్గాయని.. దాని తీవ్రత తగ్గలేదని ఆయన తెలిపారు. వైరస్ విజృంభణ ఇలానే కొనసాగితే మరోసారి దేశంలో లాక్డౌన్ విధించక తప్పదని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని ఆయన వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ప్రస్తుతం తయారువుతున్న వ్యాక్సిన్స్‌లో ఏది ఏవిధంగా పనిచేస్తుందో కూడా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల్లో చాలా కష్టపడుతున్నాయని, కానీ అనుకున్నంత తొందరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)