HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONA VIRUS CASES IN SOME STATES INCREASING DURING FESTIVAL SEASON SAYS HEALTH MINISTRY AK
Covid-19 Cases: పండగ వేళ ఈ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
Covid-19: గడిచిన 24 గంటల్లో 58 శాతం కరోనా మరణాలు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చత్తీస్గఢ్, కర్ణాటకలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
News18 Telugu | October 27, 2020, 9:51 PM IST
1/ 7
పండగ సమయంలో కరోనాతో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే హెచ్చరించారు. మహమ్మారి విషయంలో ఏమరపాటు వద్దని సూచించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ సూచనలను పాటించనట్టు కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
పండగ వేళ కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ. కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
పండగ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. మాస్క్ ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
గడిచిన 24 గంటల్లో 58 శాతం కరోనా మరణాలు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చత్తీస్గఢ్, కర్ణాటకలోనే నమోదయ్యాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 49.4 శాతం కరోనా కేసులు కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటకలోనే వెలుగుచూశాయని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఈ రాష్ట్రాలకు ప్రత్యేక కేంద్ర బృందాలను పంపించామని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల విషయంలో మరోసారి వారితో మాట్లాడతామని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
గడిచిన మూడు రోజుల పరిస్థితి బట్టి కరోనా నియంత్రణ విషయంలో వ్యూహాలను సిద్ధం చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
దేశంలోని మొత్తం కేసుల్లో 48.57 శాతం పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక నుంచే ఉన్నాయని తెలిపారు. దేశంలోని కరోనా మరణాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోనే 54.6 శాతం నమోదయ్యాయని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)