కరోనా వల్ల రాష్ట్రంలో కొత్తగా 31 మంది చనిపోయారు. ప్రకాశం జిల్లాలో 5, చిత్తూరు 4, విశాఖపట్నం 4, అనంతపురం 3, తూర్పు గోదావరి 3, కృష్ణా 3, నెల్లూరు 3, గుంటూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో ఏపీలో ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 6159కు చేరింది.