ఏపీలో కరోనా కారణంగా కొత్తగా 28 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 4, కడప 4, కృష్ణ 4, ప్రకాశం 4, గుంటూరు 3, అనంతపురం 2, తూర్పు గోదావరి 2, పశ్చిమ గోదావరి 2, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చనిపోయారు. వీరితో కలిపి ఏపీలో ఈ వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 6481కు చేరుకుంది.