HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONA VIRUS ANTIBODIES MAY STAY FOR 8 MONTHS IN HUMAN BODY REVEALS NEW RESEARCH AK
కరోనాతో పోరాడే యాంటీబాడీలు శరీరంలో ఎంతకాలం ఉంటాయో తెలుసా..
CoronaVirus: కరోనా వచ్చిపోయిన తరువాత శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయని.. అవి కొన్ని రోజుల పాటు మళ్లీ ఈ వైరస్ సోకకుండా నిరోధిస్తాయనే వార్తలు వచ్చాయి. కానీ కొందరి విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు.
News18 Telugu | December 23, 2020, 7:35 PM IST
1/ 6
ఒకసారి కరోనా వచ్చిపోయిన తరువాత మళ్లీ కొందరు ఈ వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా వచ్చిపోయిన తరువాత శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయని.. అవి కొన్ని రోజుల పాటు మళ్లీ ఈ వైరస్ సోకకుండా నిరోధిస్తాయనే వార్తలు వచ్చాయి. కానీ కొందరి విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. (ఫ్రతీకాత్మక చిత్రం )
2/ 6
దీంతో అసలు ఈ యాంటీబాడీలు మానవ శరీరంలో ఎన్ని రోజులు ఉంటాయనే దానిపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులు రెండోసారి వైరస్ బారినపడకుండా కనీసం ఎనిమిది నెలల పాటు యాంటీబాడీల రక్షణ ఉంటుందని వెల్లడైంది.(ఫ్రతీకాత్మక చిత్రం )
3/ 6
ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రకారం, రోగనిరోధక వ్యవస్థలో ఉండే మెమొరీ బీ సెల్స్, వైరస్ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్ను సుదీర్ఘకాలం పాటు గుర్తుపెట్టుకుంటాయని వెల్లడించింది.(ఫ్రతీకాత్మక చిత్రం )
4/ 6
అదే వ్యక్తిపై మరోసారి వైరస్ దాడిచేసినప్పుడు వెంటనే గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు కావాల్సిన యాంటీబాడీలను వేగంగా ఉత్పత్తి చేస్తూ రక్షణ కల్పిస్తాయని పేర్కొంది.(ఫ్రతీకాత్మక చిత్రం )
5/ 6
పరిశోధనలో భాగంగా, కరోనా సోకిన 25మంది రోగులను పరిగణలోకి తీసుకున్నారు. వైరస్ సోకిన నాలుగో రోజు నుంచి 242వ రోజు వరకూ దాదాపు 36సార్లు వారినుంచి రక్త నమూనాలను తీసుకొని పరిశోధనలు జరిపారు. వైరస్ సోకిన తర్వాత 20వ రోజు నుంచి వారిలో యాంటీబాడీలు క్షీణించిపోతున్నట్లు గుర్తించారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
6/ 6
అయితే అందరిలోనూ వైరస్‌లో ఉండే ప్రోటీన్‌ను మెమొరీ బీ కణాలు గుర్తు పెట్టుకుంటున్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా వైరస్ సోకిన ఎనిమిది నెలల తర్వాత కూడా బీ కణాలు స్థిరంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యాంటీబాడీలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. వ్యాక్సిన్ వల్ల దీర్ఘకాలిక రక్షణ కలుగుతుందని నిర్ధారణకు వచ్చారు.(ఫ్రతీకాత్మక చిత్రం )