Lockdown: దేశవ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్.. లేదంటే వినాశనం తప్పదు: ఎయిమ్స్ చీఫ్

భారత్‌లో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. వారంతపు లాక్‌డౌన్‌లు.. నైట్ కర్ఫ్యూలు పెట్టినా.. కరోనా ఉద్ధృతి మాత్రం తగ్గడం లేదు. పెద్ద ఎత్తున కొత్త కేసులు.. మరణాలు నమోదువుతన్నాయి. ఈ క్రమంలో ఎయిమ్స్ చీఫ్ డా. రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోకఠినమైన లాక్‌డౌన్ పెట్టాలని.. లేదంటే వినాశనం తప్పదని హెచ్చరించారు.