Oxygen: రంగంలోకి ఎయిర్‌ఫోర్స్.. విమానాల్లో ఆక్సీజన్ ట్యాంకర్ల తరలింపు.. ఫొటోలు

దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో తీవ్రమైన ఆక్సీజన్ కొరత ఏర్పడింది. ఇప్పటికే ప్రత్యేక రైళ్ల ద్వారా స్టీల్ ప్లాంట్స్, ఇతర పరిశ్రమల నుంచి ఆక్సీజన్ ట్యాంకర్లను తరలిస్తున్నారు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. సీ-17, ఐఎల్-76 విమానాల ద్వారా పెద్ద మొత్తంలో ట్యాంకర్లను చేరవేస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో ఆక్సీజన్‌ను నింపుకున్న తర్వాత నేరుగా ఆస్పత్రులకు తరలించనున్నారు.