Covid Cases: ఆ 46 జిల్లాల్లో కరోనా కేసులు అధికం.. కఠిన ఆంక్షలు విధించాలన్న కేంద్రం

Coronavirus: కరోనా బులెటిన్ చూస్తే కొత్త కేసులు తగ్గినట్లుగానే కనిపిస్తుంది. కేరళ తప్ప అంతటా పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ కొన్ని జిల్లాల్లో చాప కింద నీరులా కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతోంది. పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. ఆయా జిల్లాల్లో కఠిన ఆంక్షలను విధించాని స్పష్టంచేసింది.