ఎబోలా (Ebola) : ఎబోలాను మొదటిసారి పశ్చిమ ఆఫ్రికాలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కనిపెట్టారు. 2014-16 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో వేగంగా వ్యాపించిన ఈ వైరస్... 28,610 మందికి సోకింది. 11,308 మంది చనిపోయారు. మళ్లీ ఇదే వైరస్... 2018లో 3,432 మందికి సోకింది. ఈసారి 2,249 మంది చనిపోయారు. అంటే మరణాల రేటు 50 శాతంగా ఉంది. ఈ వైరస్‌కి ఇంకా టీకా (వ్యాక్సిన్) కనిపెట్టలేదు.