ఆ జిల్లాను కరోనా వణికిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే లాక్ డౌన్ తప్పదేమో అనే భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ టెన్షన్ భయపెడుతోంది. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఒమిక్రాన్ కు సంబంధించి అతడి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇదే సమయంలో మరో కలకలం రేగింది. ఒకే స్కూల్ లో 9 మంది కి పాజివ్ నిర్ధారణ అవ్వడం ఆందోళన పెంచుతోంది.
రాజాం GMR డిఏవి స్కూల్లో కరోనా కలకలం రేపింది. మొదట ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో.. స్కూళ్లో విద్యార్థుకు పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో 9 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ణారణ అయ్యింది. అయితే స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకార.. మొత్తం 14 మంది కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు.. భారత దేశాన్ని కూడా ఒమిక్రాన్ వైరస్ భయపెడుతోంది. ఇప్పటికే భారత్ లో కేసుల సంఖ్య 30 మార్కును దాటింది. నిన్ని ఒక్కరోజే 9 కేసులు నమోదయ్యాయి. అందులో 7 కేసులు ఒక్క మహరాష్ట్రలోనే వచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. అధికారికంగా ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు.
శ్రీకాకుళం వ్యక్తికి కోరనా నిర్ధారణ అయిన మాట వాస్తవమే అని.. అయితే ఇంకా ఒమిక్రానా కాదా అన్న రిపోర్ట్స్ రావాల్సి ఉంది అంటున్నారు. ఆ రిపోర్ట్స్ రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. అంటున్నారు. అయితే ఒమిక్రాన్ కన్ఫాం అయితే.. ఆ వ్యాప్తిగా చాలా వేగంగా ఉండే ప్రమాదం ఉంది. అతడు ఇప్పటికే చాలామందిని కలిశాడు. వారందర్నీ ట్రేస్ చేయడం కూడా కష్టంగానే ఉంది..
ఇలా ఓ వైపు ఒమిక్రాన్.. మరోవైపు రెట్టింపు అవుతున్న కరోనా కేసులతో జిల్లాలో ఆందోళన నెలకొంది. ఈ కేసుల పరంపర ఇలాగే కొనసాగితే.. మళ్లీ శ్రీకాకుళం జిల్లాలో కఠిన కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ ప్రకటించే ప్రమాదం లేక పోలేదని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తుంగానే అందరూ అప్రమత్తమవ్వాలని.. కఠిన నిబంధనలు పాఠించాలని వ్యాపారస్తులను అధికారులు కోరుతున్నారు.