Corona Tension in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను కరోనా వైరస్ (Corona Virus ) భయం ఇంకా వీడడం లేదు. ఈ సోమవారం వేయిలోపు కరోనా కేసులు నమోదు అయితే అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ మరుచటి రోజు నుంచి ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 1600 మార్కు దాటడం ఆందోళన పెంచుతోంది.
జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 281, తూర్పుగోదావరి జిల్లాలో 213, గుంటూరు జిల్లాలో 141, కడప జిల్లాలో 126, కృష్ణాజిల్లాలో 161 , కర్నూలు జిల్లాలో 18, నెల్లూరు జిల్లాలో 261, ప్రకాశం జిల్లాలో 114, శ్రీకాకుళం జిల్లాలో 21, విశాఖపట్నం జిల్లాలో 70, విజయనగరం జిల్లాలో 14, పశ్చిమగోదావరి జిల్లాలో 154 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.