Corona Alert : వామ్మో మళ్లీ అక్కడే కరోనా విజృంభణ .. 24గంటల్లో ఎన్ని వేల పాజిటివ్ కేసులో తెలుసా..?
Corona Alert : వామ్మో మళ్లీ అక్కడే కరోనా విజృంభణ .. 24గంటల్లో ఎన్ని వేల పాజిటివ్ కేసులో తెలుసా..?
Corona Alert: ప్రపంచ దేశాల్ని వణికించిన కరోనా వైరస్ పుట్టిన కంట్రీలోనే మళ్లీ వైరస్ వర్రీ మొదలైంది. కోవిడ్ నుంచి పూర్తిగా బయటపడి రెండేళ్లు పూర్తి కాకుండానే మళ్లీ చైనాలో కరోనా పాజిటివ్ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి.
ప్రపంచ దేశాల్ని వణికించిన కరోనా వైరస్ పుట్టిన కంట్రీలోనే మళ్లీ వైరస్ వర్రీ మొదలైంది. కోవిడ్ నుంచి పూర్తిగా బయటపడి రెండేళ్లు పూర్తి కాకుండానే మళ్లీ చైనాలో కరోనా పాజిటివ్ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. (FILE PHOTO)
2/ 9
ప్రపంచ దేశాలన్ని కరోనా నిబంధనల్ని సడలించి .. జీరో కోవిడ్ రూల్స్ అమలు చేస్తున్న సమయంలో చైనాలో పాజిటివ్ కేసులు పెరగడం అందర్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో ఈ పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. (FILE PHOTO)
3/ 9
గడిచిన 24గంటల్లో డ్రాగన్ కంట్రీలో కొత్తగా పదివేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడి అధికారుల లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక్కరోజులో 10వేల 729 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా చైనా ఆరోగ్యశాఖ వెల్లడించింది. (FILE PHOTO)
4/ 9
కరోనా వైరస్ వచ్చిన మొదటి, రెండు, మూడు సార్లలో అనేక లక్షణాలతో జనం ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు పాజిటివ్ వచ్చిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం విశేషంగా చెబుతున్నారు. (FILE PHOTO)
5/ 9
కరోనా విజృంభించడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ ఆంక్షలను మళ్లీ అమలు చేస్తోంది. ముఖ్యంగా చైనా రాజధాని బీజింగ్‌లోని నగర పార్కులను మూసివేశారు. సందర్శకుల్ని అనుమతించడం లేదు.(FILE PHOTO)
6/ 9
చైనా కంట్రీలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ కూడా అమలు చేస్తున్నారు. కరోనా మళ్లీ ఎక్కడ విరుచుకుపడుతుందో అనే భయంతో స్కూళ్లను మూసివేయడంతో విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. (FILE PHOTO)
7/ 9
చైనాలోని పలు నగరాల్లో రెస్టారెంట్లు, షాపులను మూసివేశారు. ముఖ్యంగా గాంగ్జౌ నగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ కొద్ది రోజుల నుంచి పాజిటివ్ కేసులు వేలల్లో పెరగుతుండటంతో ప్రభుత్వం కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది. (FILE PHOTO)
8/ 9
ఎక్కువ మంది నివసిస్తున్న హైఝులో కూడా ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండటంతో ఆదివారం వరకు కఠిన లాక్డౌన్ విధించారు. ఎక్కువ మంది గుంపులు గుంపులుగా రోడ్లపైకి , మార్కెట్లకు రావొద్దని నిత్యవసరాల కోసం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు అనుమతిస్తున్నారు. (FILE PHOTO)
9/ 9
ఎక్కువ మంది నివసిస్తున్న హైఝులో కూడా ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండటంతో ఆదివారం వరకు కఠిన లాక్డౌన్ విధించారు. ఎక్కువ మంది గుంపులు గుంపులుగా రోడ్లపైకి , మార్కెట్లకు రావొద్దని నిత్యవసరాల కోసం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు అనుమతిస్తున్నారు. (FILE PHOTO)