AP Corona Update: ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ భయపెడుతోంది. తాజాగా నమోదైన కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడం ఆందోళన పెంచుతోంది. మళ్లీ కరోనా సెకెండ్ వేవ్ లో లా వైరస్ విస్తరిస్తోంది. ముఖ్యంగా రెండు జిల్లాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిత్యం వేయి దాదాపు వేయి కేసులు నమోదు కావడం అధికారులను కలరవ పెడుతోంది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను.. ఈ నెల 18 నుంచి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇదీ కూడా కేసులు పెరగడానికి ఓ కారణం అయ్యే ప్రమాదం ఉంది. సంక్రాంతి వేడుక పేరుతో గ్రామాలకు చేరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో చాలామంది కరోనా నిబంధనలు పాటించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.