తొలిదశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కరోనా టీకా అందించిన కేంద్రం... సీనియర్ సిటిజన్లకు కరోనా వ్యాక్సిన్ డోసులు అందించేందుకు సిద్ధమవుతోంది. (ఫ్రతీకాత్మక చిత్రం )
2/ 7
అయితే వీరికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించే ఆలోచన లేదని.. కొంతమేర ఛార్జ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలోనే సూత్రప్రాయం తెలిపారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
3/ 7
అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే కరోనా వ్యాక్సిన్ ధర ఎంత మేర ఉండాలనే దానిపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.(ఫ్రతీకాత్మక చిత్రం )
4/ 7
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో కరోనా టీకా డోసు ధరను రూ. 250గా కేంద్రం ఖరారు చేసినట్టు సమాచారం. దీనికి రూ. 100ల సర్వీస్ ఛార్జ్ అదనంగా వసూలు చేస్తారు. వీటిని ఆస్పత్రి వర్గాలకు చెల్లించాల్సి ఉంటుంది.(ఫ్రతీకాత్మక చిత్రం )
5/ 7
జాతీయ ఆరోగ్య మిషన్ ఖరారు చేసిన ఈ ధరలను రాష్ట్రాల పరిశీలనకు పంపినట్టు తెలుస్తోంది.(ఫ్రతీకాత్మక చిత్రం )
6/ 7
అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం టీకాలు ఉచితంగానే లభించనున్నాయి.(ఫ్రతీకాత్మక చిత్రం )
7/ 7
తొలి రెండు విడతల్లో కేంద్ర ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు అందించిన కేంద్రం... మూడో విడతలో వృద్ధులతో పాటు ఇతర వ్యాధులతో బాధపడే 45 ఏళ్ల వ్యక్తులకు టీకా పంపిణీ చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తోంది.(ఫ్రతీకాత్మక చిత్రం )