ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో డెల్టా వేరియంట్ అన్ని దేశాలను వణికిస్తోంది. విదేశాలను వణికిస్తున్న డెల్టా వేరియంట్ ఇప్పుడు భారత్ లో కలవరం రేపుతోంది. (ఫ్రతీకాత్మకచిత్రం)
2/ 6
ఐతే ఆంధ్రప్రదేశ్ లోనూ ఇప్పుడు డెల్టా వేరియంట్ ఆనవాళ్లున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక కేసు నమోదైనట్లు కేంద్రం వెల్లడించినట్లు సమారం. (ఫ్రతీకాత్మకచిత్రం)
3/ 6
డెల్టా వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీతో పాటు మరో ఏడు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. (ఫ్రతీకాత్మకచిత్రం)
4/ 6
ప్రస్తుతం దేశంలో 40కి పైగా డెల్టా వేరియంట్ కేసులున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో 22 కేసులున్నాయి. మధ్యప్రదేశ్ లో 6, కేరళలో 2 కేసులు నమోదవగా.. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. (ఫ్రతీకాత్మకచిత్రం)
5/ 6
అత్యంత ప్రమాదకమైన డెల్టా వేరియంట్ శరీరంలో యాంటీ బాడీలను తప్పించుకొని బలపడుతుందని నిపుణులు చెప్తున్నారు. (ఫ్రతీకాత్మకచిత్రం)
6/ 6
ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రిపూట కర్ప్యూ అమలవుతోంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో ప్రభుత్వం సడలింపులిస్తోంది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ముప్పు నేపథ్యంలో ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. (ఫ్రతీకాత్మకచిత్రం)