3. షెడ్యూల్ ప్రకారం అకౌంట్ నెంబర్ చివర్లో 0 లేదా 1 నెంబర్ ఉన్నవారికి మే 4, అకౌంట్ నెంబర్ చివర్లో 2 లేదా 3 నెంబర్ ఉన్నవారికి మే 5, అకౌంట్ నెంబర్ చివర్లో 4 లేదా 5 నెంబర్ ఉన్నవారికి మే 6, అకౌంట్ నెంబర్ చివర్లో 6 లేదా 7 నెంబర్ ఉన్నవారికి మే 8, అకౌంట్ నెంబర్ చివర్లో 8 లేదా 9 నెంబర్ ఉన్నవారికి మే 11 తేదీల్లో రూ.500 జమ అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. లబ్ధిదారులు బ్యాంకులు, బ్యాంకు మిత్ర, సీఎస్పీ, ఏటీఎంలో డ్రా చేసుకోవచ్చు. అయితే గతంలో డ్రా చేసుకోకపోతే తిరిగి వెళ్లిపోతాయన్న ప్రచారం జరిగింది. దీంతో లబ్ధిదారులు ఏటీఎంలు, బ్యాంకులకు క్యూకట్టారు. నిజంగానే డబ్బులు వెనక్కి వెళ్తాయని భావించారు. కానీ ఇవన్నీ పుకార్లే. డబ్బులు అకౌంట్లో జమ అయిన తర్వాత ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్టైతే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసి ఉంటాయి. మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేయడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో పొందొచ్చు. మరి బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు జన్ ధన్ అకౌంట్ ఉంటే 18004253800 లేదా 1800112211 నెంబర్లకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీకు చివరి 5 ట్రాన్సాక్షన్లు, మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి. 9223766666 నెంబర్కు కాల్ చేసి కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. Punjab National Bank: మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జన్ ధన్ అకౌంట్ ఉంటే 18001802223 లేదా 01202303090 నెంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీకు బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. లేదా BAL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ 16 అంకెల అకౌంట్ నెంబర్ టైప్ చేసి 5607040 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపితే మీ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)