Covid Vaccine: వికటించిన చైనా కరోనా టీకా.. ప్రయోగాలు నిలిపేసిన బ్రెజిల్

'కరోనావాక్' చివరి దశ ప్రయోగాలు వికటించాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో చాలా తీవ్రంగా దుష్ప్రభావాలు కనిపించడంతో కరోనావాక్ టీకా ప్రయోగాలను బ్రెజిల్‌లో(Brazil) నిలిపివేశారు. చైనా వ్యాక్సిన్ (China vaccine) ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్ ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేసింది.